Two Govt Jobs Achiever : నెల రోజుల వ్యవధిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇతని సక్సెస్ స్టోరీ ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో లక్షల మంది యువకులు ఈ పరీక్షలను రాసేందుకు సిద్ధమవుతుంటారు. వారందని దాటుకొని చివరికి గెలుపుని అందుకున్నాడు శింగరపల్లి గ్రామానికి చెందిన కామునూరి విజయకుమార్. కామునూరి చంద్రమోహన్, జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా మొదటి కుమారుడైన కామునూరి విజయకుమార్. ఇతని ఆశయం గ్రూప్-4 ఉద్యోగం. దాని కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాడు అన్నింటిలోనూ ఉన్నతంగా రాణించాడు. ఇటీవలె నిర్వహించిన గ్రూప్-4 పరీక్షల ఫలితాలు వెలువడగా ఉన్నతంగా నెగ్గి ఉద్యోగం సాధించాడు.
విద్యాజీవితం..
విజయకుమార్ మొదట తన ప్రాథమిక విద్యను తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పల్‌లో పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత, ఇంటర్మీడియట్‌ను ఒంగోలులోని ప్రతిభ కాలేజ్‌లో, బీటెక్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశాడు.
కానిస్టేబుల్‌గా ఇలా..
తన ఆశయమైన గ్రూప్-4 ఉద్యోగం సాధించేందుకు మొదట గత ఏడాది నవంబర్ 2024లో మొదటి ప్రయత్నంలోనే సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కాని, ఇందులో తనకు ఆశ లేనప్పటికి, వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎందుకు కాదనాలని దానిని వదలకుండా తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా ఇప్పటివరకు విధులు నిర్వహించారు.
Bishnoi IAS Officer Success Story : ఓ సన్యాసి సాహసం.. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారిలా.. కానీ ట్విస్ట్ ఇదే..
వెంటనే గ్రూప్-4
తనకు వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన ఒక నెలలోపే టీజీఎస్‌సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల అయింది. తన ఆశయం అయిన గ్రూప్-4 నోటిఫికేషన్ వచ్చినప్పుడు తాను మరింత పట్టుదలతో ప్రయత్నించి, ఈసారి తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఎలాగైనా గ్రూపు 4 ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి, గ్రూప్-4 లోనూ 12వ ర్యాంకుతో ఉద్యోగం సాధించాడు. ఇక దీంతో, తనకు జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు విజయకుమార్. నెలరోజుల వ్యవధిలోనే విజరుకుమార్ ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)