TSPSC: లైబ్రరీల్లో పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్, ఉన్నత విద్యాశాఖ నియంత్రణలో ఉన్న గ్రంథాలయాల్లోని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేటి నుంచి హాల్‌టికెట్‌ https://tspsce. gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
లైబ్రరీల్లో పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(సీబీఆర్‌టీ)తో నిర్వహించనున్న లైబ్రేరియన్‌ పరీక్ష మే 17న ఉదయం 10 గంటల నుంచి 12–30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2–30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని మే 9న ఓ ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 45 నిమిషాల ముందే రావాలని పేర్కొంది. పరీక్ష విధానంపై మాక్‌ టెస్టు కోసం  https://www..digialm. com:443//onlineassessment/index.html?1222@m2ను చూడాలని విద్యార్థులకు సూచించింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

#Tags