1180 AEE Jobs: ఏఈఈ (సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ– సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జాబితాను వెల్లడించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ పరీక్ష రాసినవారు జూలై 4న కేటీఆర్‌ను కలిశారు.
చదవండి: TSPSC Group 4: ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన ఈ అభ్యర్థులకు వైద్య పరీక్షలు
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏఈఈ (సివిల్) రాత పరీక్ష నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేసిందన్నారు.
22నెలల క్రితం నోటిఫికేషన్ విడుదలై పరీక్ష జరిగిందని, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా విడుదల చేయడం లేదని తెలిపారు.
Published date : 04 Jul 2024 12:44PM