Skip to main content

R Krishnaiah: ‘గ్రూప్‌’ పోస్టులు భర్తీ చేయాలి

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–1, 2, 3, 4 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు.
Representation of government job recruitment in Telangana   Telangana State Government  Group-1, 2, 3, 4 Jobs  Group posts should be filled  R. Krishnaiah, BC Welfare Association National President

ఈ మేరకు మే 31న‌బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొందరు అధికారులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా పోస్టులను సరైన పద్ధతిలో లెక్కించలేదని తెలిపారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా కింద గ్రూప్‌ సర్వీసుల్లో 50 శాతం పోస్టులను ప్రతి శాఖలో భర్తీ చేయాలని కోరారు. కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరు చేసి ఆప్షన్, వెయిటింగ్‌ లిస్ట్‌ పద్ధతులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Published date : 01 Jun 2024 11:43AM

Photo Stories