TS TET 2024 PostPone : టీఎస్ టెట్-2024 ప‌రీక్ష‌ మ‌ళ్లీ వాయిదా..? కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ‌లో డీఎస్సీ, టెట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అడ్డంకులు ఎదుర‌వుతునే ఉన్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024) వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో పరీక్షను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.

సాధారణ సెలవు.. కానీ..
మే 27న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనున్నది. అయితే మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్‌ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులేకానుండటంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారో వెల్లడించలేదు.

☛ Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా..
ఎన్నికల షెడ్యూల్‌ దృష్ట్యా పేపర్ల వారీగా పరీక్షలు నిర్వహించే తేదీలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే కేవలం పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

#Tags