TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SBI Youth Fellowship 2024 : రూ.15000 స్టైఫండ్‌తో ఫెలోషిప్.. అర్హతలు ఇవే..
కాగా టెట్ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మే 20 నుంచి జూన్ 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది