TS TET 2024: తొలిరోజు యావరేజ్‌గా టెట్ ప్రశ్నపత్రం..77% మంది హాజరు
Sakshi Education
తెలంగాణ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న జరిగిన పరీక్షలకు పేపర్-2 గణితం, సైన్స్‌కు తొలిరోజు కేవలం 77.81 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 34,436 మందికి 26,796 మంది పరీక్ష రాశారు. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ పేపర్ మధ్యస్థంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు.
తెలుగులో గ్రామర్, కవుల పై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, సైకాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు సాధారణంగానే వచ్చాయని తెలిపారు. కాగా నిన్నటితో ప్రారంభమైన టెట్ పరీక్షలు జూన్6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్ల చొప్పున ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
Published date : 21 May 2024 01:39PM