TS TET 2024: తెలంగాణ టెట్ దరఖాస్తులకు నేడే చివరి తేదీ..!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అభ్యర్థులు ఇప్పటికే వారి దరఖాస్తులను చేసుకున్నారు. ఇప్పటికే చాలామంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే, నేటితో దరఖాస్తులకు సమయం ముగియడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా ఈరోజు లోగా తమ వివరాలను tstet2024.aptonline.in/tstet/ ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఈ తేదీని పొడగించేది లేకపోగా అభ్యర్థులంతా ఈరోజే నమోదు చేసుకోవాలి.
Telangana Inter Results Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్స్
ఈ టెట్ పరీక్షలో అభ్యర్థులకు రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది.. ఒకటో నుంచి ఐదో తరగతి వరకు శిక్షణ ఇవ్వాలనుకున్నవారు ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. రెండో పేపర్.. ఆరు నుంచి ఎనమిది తరగతులకు శిక్షణ ఇవ్వాలనుకున్నవారు ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు.
School Education Department: ‘సెలవుల్లో సరదాగా – 2024’ అమలు చేయాలి
ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్‌ను మే 15వ తేదీన వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. కొన్ని కారణాల వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, ఎస్‌సీఈఆర్‌టీ లేదా మాజీ డైరెక్టర్‌ను సంప్రదించవచ్చు..
AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే
దరఖాస్తు చేసుకోండి ఇలా..
- tstet2024.aptonline.in. వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనే లింక్ పైన క్లిక్ చేయండి.
- అందులో అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- తర్వాత తెలంగాణ టెట్ అప్లికేషన్‌లో మీ వివరాలను నమోదు చేయండి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించండి.
- తిరిగి మరోసారి మీరు నమోదు చేసిన వివరాలను, అప్‌లోడ్ చేసిన పత్రాలను పరిశీలించి, సమర్పించండి.
AP EAPCET 2024 Exam Rescheduled: ఏపీ ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే