Skip to main content

Telangana Inter Results Updates: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై లేటెస్ట్‌ అప్‌డేట్స్‌

Preparation for Telangana Intermediate results declaration  Telangana Inter Results Updates   Telangana Intermediate results announcement

తెలంగాణ  ఇంటర్మీడియెట్‌ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల కోసం అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది.

ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. ఒకేసారి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇంటర్ ఫలితాల విడుదల కోసం ఈసీ అనుమతి కూడా కోరారు. ఈసీ నుంచి అనుమతి రాగానే  సోమవారం(ఏప్రిల్‌ 22)న ఇంటర్‌ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

ఒకవేళ సోమవారం ఏదైనా సాంకేతిక, లేదా మరేదైనా కారణాలతో సాధ్యం కాకపోతే మంగళవారం అంటే ఏప్రిల్‌ 23న రిజల్ట్‌ అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. కాగా తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.comలో చూడొచ్చు.
 

Published date : 20 Apr 2024 04:17PM

Photo Stories