TET 2024 Hall Ticket Download : టెట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం ఇలా.. ఏదైనా సమస్య ఉంటే ఇలా చేయండి..
సాక్షి ఎడ్యుకేషన్: టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ ... ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టే అర్హత పరీక్ష. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పని చేయాలంటే ముందుగా టెట్లో ఉత్తీర్ణత సాధించాలి... ఆ తర్వాత డిఎస్సి (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. దీంతో, స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ టీచర్ పోస్టులను భర్తీ చేయగలరు.
DSC 2024: డీఎస్సీ–2024లో అనర్హులకు హిందీ ఉద్యోగాలు
వచ్చే నెలలో(జనవరి 2025) జరగనున్న టెట్ పరీక్ష కోసం డిసెంబర్ 26, 2024 అంటే గురువారం నుండి హాల్ టికెట్లును అందుబాటులో పెట్టారు. ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం..
తెలంగాణ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన విధానం..
1. అధికారిక వెబ్‌సైట్ https://tstet2024.aptonline.in/ ను ఓపెన్ చేయండి.
2. అక్కడ కనిపిస్తున్న హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు https://tgtet2024.aptonline.in/tstet/HallticketFront కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
3. ఓపెన్ అయిన పేజీలో అడిగిన వివరాలను నమోదు చేయండి. ప్రొసీడ్ (proceed)పై క్లిక్ చేయండి.
4. ఇంక మీకు మీ హాల్‌టికెట్ కనిపిస్తుంది. ఇక దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. (ప్రింట్ తీసుకున్న ఒక కాపీని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఇది లేకపోతే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు.) హాల్‌టికెట్ కనిపించినప్పుడు మీ వివరాలను ఒకసారి పరిశీలించుకోండి.
Telangana TET 2024 Hall Ticket Download: నేడు టెట్ హాల్‌టికెట్లు విడుదల ....డౌన్‌లోడ్ విధానం ఇలా..
డౌన్‌లోడ్‌లో సమస్య..
టెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఒకవేళ ఏదయినా సాంకేతిక కారణాలతోగానీ, మరేదైనా సమస్య వల్లగానీ హాల్ టికెట్ డౌన్లోడ్ కాకుండా ఉంటే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే SCERT (State Council of Educational Research and Training) & Ex-officio Director, TET, Hyderabad కార్యాలయాన్ని సందర్శించండి. వర్కింగ్ డే లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటలవరకు సంప్రదించవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)