TS TET 2023: టెట్‌ విధులపై శిక్షణ

సెప్టెంబర్‌ 15న పరీక్ష, 27న ఫలితాలు విడుదల కానున్నాయి. పేప‌ర్‌-1 మొత్తం 150 మార్కులు, పేప‌ర్‌-2 150 మార్కుల‌కు ఉంటుంది.

సంగారెడ్డి అర్బన్‌: ఈనెల 15 నుంచి టెట్‌ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో విధుల నిర్వహణపై రూట్‌ ఆఫీసర్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్స్‌కు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం శిక్షణ ఇచ్చారు.

TS TET 2022 Preparation Tips : టెట్‌లో ఉత్తమ స్కోర్‌ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుందా?

మరలా ఈనెల 14న ఉదయం కలెక్టర్‌ కార్యాలయంలో ని ఆడిటోరియంలో హాజరుకావాలని, విధుల కేటాయింపులుంటాయని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో పేపర్‌–1కు 13,537 అభ్యర్థులు, పేపర్‌ –2కు 9,729 మంది మొత్తం 23,266 పరీక్ష రాయనున్నారన్నారు. జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష ఉంటుందని తెలిపారు.

TS TET 2023 Environmental Science Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

 టెట్‌లో వ‌చ్చిన మార్కుల‌కు డీఎస్సీలోనూ వెయిటేజీ ఉంటుంది. పేప‌ర్‌-1,2 రెండిట్లోనూ అభ్య‌ర్థులు అర్హ‌త సాధించాలి. ప్రస్తుత విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

టెట్‌ వ్యవధి జీవితకాలం... కానీ,
తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు.

TS TET 2023 Bitbank: చాప్టర్ల వారీగా Perspectives in Education ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

#Tags