Skip to main content

TS TET 2024: తెలంగాణ టెట్‌ దరఖాస్తులకు నేడే చివరి తేదీ..!

టెట్‌ పరీక్షకు నేడే చివరి తేదీ కాగా, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రకటించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోండి.
Last date for registration to write Telangana TET exam  Telangana Teacher Eligibility Test application deadline today  TSTET 2024 application registration   Last chance to apply for Telangana TET 2024

సాక్షి ఎడ్యుకేషన్‌: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అభ్యర్థులు ఇప్పటికే వారి దరఖాస్తులను చేసుకున్నారు. ఇప్పటికే చాలామంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే, నేటితో దరఖాస్తులకు సమయం ముగియడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా ఈరోజు లోగా తమ వివరాలను tstet2024.aptonline.in/tstet/ ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఈ తేదీని పొడగించేది లేకపోగా అభ్యర్థులంతా ఈరోజే నమోదు చేసుకోవాలి. 

Telangana Inter Results Updates: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై లేటెస్ట్‌ అప్‌డేట్స్‌

ఈ టెట్‌ పరీక్షలో అభ్యర్థులకు రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది.. ఒకటో నుంచి ఐదో తరగతి వరకు శిక్షణ ఇవ్వాలనుకున్నవారు ఈ పేపర్‌ రాయాల్సి ఉంటుంది. రెండో పేపర్‌.. ఆరు నుంచి ఎనమిది తరగతులకు శిక్షణ ఇవ్వాలనుకున్నవారు ఈ పేపర్‌ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు.

School Education Department: ‘సెలవుల్లో సరదాగా – 2024’ అమలు చేయాలి

ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్‌ను మే 15వ తేదీన వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. కొన్ని కారణాల వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, ఎస్‌సీఈఆర్‌టీ లేదా మాజీ డైరెక్టర్‌ను సంప్రదించవచ్చు..

AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే

దరఖాస్తు చేసుకోండి ఇలా..

  • tstet2024.aptonline.in. వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెస్‌ అనే లింక్‌ పైన క్లిక్‌ చేయండి.
  • అందులో అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • తర్వాత తెలంగాణ టెట్‌ అప్లికేషన్‌లో మీ వివరాలను నమోదు చేయండి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయండి.
  • అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • తిరిగి మరోసారి మీరు నమోదు చేసిన వివరాలను, అప్‌లోడ్‌ చేసిన పత్రాలను పరిశీలించి, సమర్పించండి.

AP EAPCET 2024 Exam Rescheduled: ఏపీ ఎంసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే

Published date : 20 Apr 2024 04:26PM

Photo Stories