TS TET 2024 Registrations Extended: టెట్ దరఖాస్తు గడువు పెంపు.. వీరూ కూడా టెట్ రాయాలి: సుప్రీంకోర్టు
ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 11న నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వాస్తవానికి టెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 10తో ముగిసింది. ఇప్పటి వరకు మొత్తం 2,33,243 దరఖాస్తులు అందాయి.
పేపర్–1కు 85,625, పేపర్–2కు 1,47,618 దరఖాస్తులు వచ్చాయి. పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్ పేపర్స్ | TS TET ప్రివియస్ పేపర్స్
అయితే, ప్రైమరీ హెచ్‌ఎంకు ఎస్జీ టీలను తీసుకునేప్పుడు, హైస్కూల్ హెచ్‌ఎంకు స్కూల్ అసిస్టెంట్లను తీసుకునేటప్పుడు టెట్‌తో పనేంటని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరాయి.
ఈ నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వా లని లేఖరాశారు. సమాధానం వచ్చిన తర్వాతే సర్వీస్ టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేసుకునే వాతావరణం కన్పించింది.
ఈ కారణంగా టెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. టెట్ పరీక్ష తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయడంలేదు. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్ష జరుగుతుంది.