Inter Supplementary Time Table: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ టైం టేబుల్ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డ్‌ బుధవారం విడుదల చేసింది.

మే 24 నుంచి జూన్‌ 1 వరకూ పరీక్షలు ఉంటాయని, ప్రాక్టికల్స్‌ జూన్‌ 3 నుంచి 7వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ జూన్‌ 10 ఉంటాయని పేర్కొంది. ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ 11వ తేదీ, ఎథ్నిక్స్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష జూన్‌ 12న నిర్వహిస్తున్నట్టు వివరించింది.

ఫస్టియర్‌ థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్‌ సాయంత్రం 2.30 నుంచి 5.30 గంటల వరకూ ఉంటాయని వెల్లడించింది. ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

కాగా, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు ప్రకటించింది. మార్కుల జాబితాను ఏప్రిల్ 25న‌ సాయంత్రం నుంచే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. మార్కులపై సందేహాలుంటే 10 రోజుల్లోగా తమకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం పేపర్‌కు రూ. 600 చెల్లించి గురువారం నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

☛ మే–24 : SECOND LANGUAGE –I & II
☛ మే–25 : ENGLISH–I & II
☛ మే–28 : MATHS– A/BOT/CIVICS-I & II
☛ మే–29 : MATHS– B/ZOO/HIST –I & II
☛ మే–30 : PHYSICS/ECONOMICS –I & II
☛ మే–31  : CHEMISTRY/ OMMERCE –I & II
☛ జూన్–01 : PUB.ADMN./BRIDGE COURSE MATHS –I & II
☛ జూన్– 03 : MODERN LANGUAGE /GEOGRAPHY –I & II

☛ జూన్ 4వ తేదీ నుంచి 8 వరకు సప్లిమెంటరీ ప్రాక్టీకల్ పరీక్షలు
☛ జూన్ 10వ తేదీ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు
☛ జూన్ 11వ తేదీ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
☛ జూన్ 12వ తేదీ ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూస్ పరీక్ష

☛ Venkata Naga Sai Manasvi Scored 599/600 Marks : ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో ఈ విద్యార్థికి 599/600 మార్కులు వ‌చ్చాయ్‌.. ఎలా అంటే..?

#Tags