Intermediate Public Exams 2024:రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ
రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ
విద్యారణ్యపురి : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప రీక్షలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తే దీ నుంచి స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) ప్రక్రియ నిర్వహించబోతున్నారు. మొత్తం నాలుగు దశలో వివిధ సబ్జెక్టు జవాబుపత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఉమ్మడి వరంగల్ జల్లా కేంద్రం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ క్యాంపునకు వివిధ సబ్జెక్టుల జవాబుపత్రాల 6లక్షల 20వేల వరకు చేరుకున్నాయి. ఈ క్యాంపు ఆఫీసర్‌గా హనుమకొండ జిల్లా డీఈఐఓ ఎ గోపాల్, ఏసీఓ జనరల్–1గా హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర వ్యవహరిస్తున్నారు.
#Tags