Inter 2nd Round Admission List: ‘బీసీ గురుకుల కాలేజీ’ల్లో రెండోవిడత ప్రవేశాల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి రెండోవిడత ఎంపిక జాబితా జూన్ 7న‌ సొసైటీ కార్యదర్శి బి.సైదులు విడుదల చేశారు.

ఈ జాబితాను బీసీ గురుకుల సొ సైటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల కాలేజీల్లో 21,920 సీట్లు ఉండగా...మొదటి విడతలో 18,749 సీట్లకు విద్యా ర్థులను ఎంపిక చేశామని, ఇందులో భాగంగా 10,562 మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేశారన్నారు.

మిగులు సీట్ల భర్తీకి రెండో జాబి తాను తాజాగా విడుదల చేశామని, ఎంపికైన విద్యార్థులు ఈనెల 14వ తేదీలోగా కాలేజీలో రిపోర్టు చేయాలన్నారు.  

చదవండి:

RGUKT-AP: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు..

TS/AP Polycet 2024: సత్వర ఉపాధికి మార్గం.. పాలిటెక్నిక్స్‌

#Tags