Inter Admissions: గురుకుల ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

మరికల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అనురాధ మే 28న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్‌ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సప్లిమెంటరీ పరీక్షలకు 85మంది గైర్హాజరు

నారాయణపేట రూరల్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు మే 28న‌ కొనసాగాయి. జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలలో మూడవరోజు గణితం, బాటనీ, సవిక్స్‌ పరీక్షలు జరిగాయి. ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబందించి జనరల్‌ విభాగంలో 1696కి 1643మంది, ఒకేషనల్‌ విభాగంలో 60కి 58మంది హాజరయ్యారు.

చదవండి: Inter Admissions: మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన సెకండియర్‌ పరీక్షకు రెగ్యులర్‌ విభాగంలో 715కు 685మంది, ఒకేషనల్‌ విభాగంలో 19కు 16మంది హాజరయ్యారు. ఉదయం డీఈసీ బృందం నారాయణపేట, మక్తల్‌, కోస్గి, ఫ్లయింగ్‌ స్కాడ్‌ ధన్వాడ, మద్దూర్‌, సిట్టింగ్‌ స్వ్కాడ్‌ నారాయణపేట, మద్దూర్‌, మధ్యాహ్నం డీఈసీ బృందం మద్దూర్‌, నారాయణపేటలో, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ నారాయణపేట, సిట్టింగ్‌ స్వ్కాడ్‌ కోస్గి, నారాయణపేటలో తనిఖీలు చేశారు. డీఐఈఓ రియాజ్‌హుస్సేన్‌, పరీక్షల విభాగం అధికారి సుదర్శన్‌ పట్టణంలోని కేంద్రాలు పరిశీలించారు.
 

#Tags