Gurukul Intermediate Admissions: గురుకుల జూనియ‌ర్ ఇంట‌ర్మీడియ‌ట్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

అర్హులైన విద్యార్థులు ప్ర‌క‌టించిన తేదీలోగా ఇంట‌ర్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని తెలిపారు గురుకుల క‌ళాశాల ప్రిన్సిపాల్ ఏ శార‌ద‌..

రాయ‌దుర్గం: ఎస్సీ గురుకుల సొసైటీ ప‌రిధిలోని నాన్ సీఓఈ (సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌) గురుకుల విద్యాల‌యాల్లో జూనియ‌ర్ ఇంట‌ర్మీడియ‌ట్‌లో మిగిలిన సీట్ల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానిస్తున్న‌ట్లు గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక‌ల క‌ళాశాల ప్రిన్సిపాల్ ఏ శార‌ద శ‌నివారం తెలిపారు.

AP Inter Advanced Supplementary: ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌కు గైర్హాజ‌రైన విద్యార్థులు..

ప‌ద‌వ త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఈనెల 31వ తేదీ వ‌ర‌కు గురుకుల సొసైటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, వృత్తివిద్యా కోర్సుల్లో సీట్లు ఉన్నాయ‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో రూ. 100 చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. ఈ అవ‌కాశాన్ని అర్హులైన‌వారు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

POLYCET Counselling 2024: పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన వారికి కౌన్సెలింగ్‌..

#Tags