Govt ITI Counselling : ప్రభుత్వ ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు..
ఉండి: జిల్లాలోని రెండు ప్రభుత్వ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు గురువారం తెలిపారు. అభ్యర్థులు ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు iti.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
Intermediate Admission 2025 : ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు ఆఖరి అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు
ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని ఐటీఐలో ఆన్‌లైన్ చేస్తారని, ఆన్‌లైన్ చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని రశీదు పొందాలన్నారు. ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రశీదుతో హాజరుకావాలన్నారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు వెల్డర్ కోర్సు (ఏడాది) అవకాశం ఉందన్నారు. వివరాలకు 08816–297093, 9676099988 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
World's Oldest Person: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమెనే.. ఏ దేశానికి చెందిన మహిళంటే!