Skip to main content

POLYCET Counselling 2024: పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన వారికి కౌన్సెలింగ్‌..

పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్ర‌వేశం పొందేందుకు రేపటినుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, న‌మోదు చేసుకోవాల్సిన వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
POLYCET 2024 Counselling for admissions at polytechnic colleges  Student counselling precautions

తిరుపతి: పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 27 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన(కౌన్సెలింగ్‌) నిర్వహించనున్నారు. ఆ మేరకు తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24 నుంచి జూన్‌ 2వ తేదీలోపు ‘ appolycet.nic.in’ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

TGPSC Group-1 Prelims 2024: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు క‌ఠ‌న నిబంధ‌న‌లు ఇవే.. హాల్‌టికెట్ విష‌యంలో మాత్రం..!

ఈ నెల 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ఆన్‌లైన్లో ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని, జూన్‌ 5న ఆప్షన్స్‌లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని, 7వ తేదీన అలాట్‌మెంట్‌ ప్రకటిస్తారని, 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, పలమనేరు, మదనపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కౌన్సెలింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అయితే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్టీ అభ్యర్థులు మాత్రం తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని సూచించారు. స్పెషల్‌ కేటగిరి కలిగిన అభ్యర్థులు (పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మొదలగు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పరిశీలన చేయించుకోవాలని తెలిపారు.

AP Polycet 2024 Counselling Dates : ఏపీ పాలిసెట్-2024 కౌన్సిలింగ్ తేదీలు ఇవే..

సర్టిఫికెట్లు ఇవే

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు రిసీప్ట్‌, పాలిసెట్‌ హాల్‌ టికెట్‌, పాలిసెట్‌ ర్యాంకు కార్డు, పది, తత్సమాన విద్యార్హత మార్క్స్‌ మెమో, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువ పత్రం, ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌, టీసీ తీసుకురావాలని తెలిపారు.

University of Tokyo: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విశ్వవిద్యాలయం ప్రారంభం.. ఎక్క‌డంటే.?

Published date : 27 May 2024 10:49AM

Photo Stories