TG Polycet 2025: తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (TG POLYCET 2025) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు మే 13వ తేదీన పాలిసెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ నుండి ఫలితాల వెల్లడి వరకు పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ తెలుసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 18 మార్చి, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 మార్చి, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 19 ఏప్రిల్, 2025
దరఖాస్తు రుసుం:
- SC & ST: ₹250
- ఇతరులు: ₹500
ఆపరాధ రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ:
- ₹100 ఆపరాధ రుసుముతో: 21 ఏప్రిల్, 2025
- ₹300 ఆపరాధ రుసుముతో: 23 ఏప్రిల్, 2025
పరీక్ష తేదీ: 13 మే, 2025
ఫలితాల విడుదల: పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://polycetts.nic.in
>> సాయుధ దళాల్లో ‘భద్రతా’ ఉద్యోగం: CAPF AC పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్!
Published date : 20 Mar 2025 03:13PM
Tags
- Telangana POLYCET 2025 application
- TS POLYCET 2025 registration
- Telangana Polytechnic entrance 2025
- TS POLYCET exam date 2025
- Telangana POLYCET apply online
- POLYCET 2025 last date
- TS POLYCET eligibility criteria
- Telangana Polytechnic admission 2025
- POLYCET 2025 notification Telangana
- TS POLYCET syllabus 2025
- TelanganaTechnicalEducation
- TGPolyCETExamDate
- ApplyOnlinePolyCET
- PolytechnicDiplomaCourses