TS 10th Class Supplementary Exams: నేటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11 వరకు కొనసాగనున్నాయి. అయితే 4వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ దృష్ట్యా ఆ రోజు పరీక్ష నిర్వహించడం లేదని డీఈవో ప్రణీత తెలిపారు.

జిల్లాలో 818 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నం.1, ఉట్నూర్‌లోని తెలుగు మీడియం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బోథ్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఉన్నాయి.

TS POLYCET Results 2024 : మరికాసేపట్లో పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.
 

#Tags