10th Class Results: ‘పది’ ఫలితాల్లో ముందంజలో ఉండాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మార్చి 6న‌ అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఈవో అశోక్‌తో కలిసి హెచ్‌ఎంలు, హాస్టల్‌ వార్డెన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ ఏపీ టెన్త్ క్లాస్

ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో మొత్తం 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 6,595 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. సెంటర్లలో ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. డీటీడీవో రమాదేవి, డీఎంహెచ్‌వో తుకారాం, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

#Tags