Teacher Transfers: టీచర్ల బదిలీలకు బ్రేక్‌

నిర్మల్‌రూరల్‌: టీచర్ల బదిలీలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. బదిలీలతోపాటు ప్రమోషన్లు కూడా ఇవ్వాలని వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయిని హైకోర్టులో పిల్‌ వేశారు.
టీచర్ల బదిలీలకు బ్రేక్‌

 దీనిపై అక్టోబ‌ర్ 6న‌ విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీదేవి ఈనెల 19 వరకు బదిలీలు జరుపొద్దని స్టే విధించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బది లీలు ఆగిపోనున్నాయి. ఎస్జీటీ, తత్సమాన క్యాడర్‌కు సంబంధించిన ఉపాధ్యాయుల బదిలీలకు 6 ,7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరా రు చేసింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో అక్టోబ‌ర్ 6న‌ సాయంత్రం నుంచి బదిలీలకు సంబంధించిన సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. ఇప్పటికే పీజీహెచ్‌ఎం, స్కూ ల్‌ అసిస్ట్‌ బదిలీ ప్రక్రియ ముగిసింది.

చదవండి: Teachers with Students: విద్యార్థుల‌పై ఉపాధ్యాయుల‌కు శ్ర‌ద్ధ ఉండాలి

రంతా తమకు కేటాయించిన పాఠశాలలో జాయిన్‌ అయ్యారు. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే టెట్‌ ఉన్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు బదిలీలు కూడా ఆగిపోవడంతో సాధారణ ఎన్నికల తర్వాతనే ఈ ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

#Tags