Teachers with Students: విద్యార్థులపై ఉపాధ్యాయులకు శ్రద్ధ ఉండాలి
సాక్షి ఎడ్యుకేషన్: విద్యాలయాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, నైతిక విలువలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఈ మేరకు మండలంలోని కిల్తంపాలెం పంచాయతీలో గల జవహర్ నవోదయ విద్యాలయలో హర్యానా విద్యార్థులపై వ్యాయామ ఉపాధ్యాయుడు శారీరక దండనకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు హర్యానా కలెక్టర్ సమాచారంతో జిల్లా సిబ్బందితో కలిసి మంగళవారం ఆయన నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు.
Employment Offer: స్థానికులకు ఉపాధి అవకాశం
ఈ సందర్భంగా హర్యానా విద్యార్థులను ఆరా తీశారు. పాఠశాల ఆవరణ, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలపై విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం అధ్యాపక సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ ఉపాధ్యాయులుగా మీ భాద్యత. వారికి నైతిక విలువలు నేర్పడంతో పాటు, స్నేహపూర్వకంగా మెలగాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మీ పరిశీలనలో ఉన్న విద్యార్థుల పట్ల ప్రేమ, అభిమానం, వాత్సల్యం చూపాలని హితవు పలికారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సృహృద్భావ వాతావరణం ఉండాలని సూచించారు.
Jobs Through CPET: యువతకు సీపెట్ ద్వారా ఉద్యోగాలు
ఉపాధ్యాయులు విద్యార్థులపై కఠిన చర్యలకు పాల్పడినా, హింసించినా, వేధించినా అటువంటి ఉపాధ్యాయులపై తగిన చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. హర్యానా విద్యార్థుల విషయంలో జరిగిన ఘటన, అనంతరం ఫిర్యాదుపై వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి.దుర్గాప్రసాద్, జిల్లా బాలల విభాగం అధికారులు కె.జయలక్ష్మి, యాళ్ల నాగరాజు, వెన్నెల సంధ్య తదితరులు పాల్గొన్నారు.