10th Paper Leak: మరో పేపర్ లీక్... పరీక్ష సమయానికి ముందే వాట్సప్‌లో చక్కర్లు
వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఉదయం 9.30కే పేపర్ బయటకు వచ్చేసింది. టెన్త్ విద్యార్థులకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ ప్రత్యక్షమైంది. వరుసగా పేపర్ లీక్ అవుతుండడం.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏడాదిపాటు చదివిన విద్యార్థులు లీక్ వార్తలు వింటూ ఆవేదనకు గురవుతున్నారు.
చదవండి: ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్.. ఐదుగురిపై సస్పెన్షన్ వేటు
మొదటి రోజే లీకేజీ...!
పదో తరగతి పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా సోమవారం(ఏప్రిల్ 3) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజే తెలుగు పేపర్ లీకవడం ఆందోళన పరిచింది. నిన్న ఏడు నిమిషాలు ఆలస్యంగా పేపర్ బయటికి వస్తే... నేడు మాత్రం కచ్చితంగా పరీక్ష సమయానికే సోషల్ మీడియాలో పేపర్ ప్రత్యక్షమైంది. తెలుగు పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ అవేమీ సత్ఫలితాలు ఇచ్చిన్నట్లు కనిపించడం లేదు. మరోవైపు లీకేజీ ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: బిగ్ బ్రేకింగ్... మొదటి రోజే టెన్త్ పరీక్ష పేపర్ల లీక్..?