Teacher V Madhavi: రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయురాలి ప్రతిభ
దుబ్బాక: మున్సిపల్ పరిధిలోని లచ్చపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న వి.మాధవి వినూత్న రీతిలో విద్యార్థులకు బోధించడంపై రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చాటారు.
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌ఈఆర్‌టీ) వారు ఉపాధ్యాయురాలి ప్రతిభను గుర్తించారు. వినూత్నమైన బోధన ఉపకరణాలు ఉపయోగించి విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించారు. వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మాధవి కృషి చేశారు.
ప్రతిభను గుర్తించిన ఎస్‌ఈఆర్‌టీ ఆమె సక్సెస్ స్టోరీని హార్బింజర్స్ ఆఫ్ ఛేంజ్ పుస్తకంలో ప్రచురించారు. గతంలో సైతం మాధవి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికై అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో లచ్చపేట పేరును నిలిపిన ఉపాధ్యాయురాలు మాధవిని గ్రామస్తులు అభినందించారు.
#Tags