Tenth Class Exams 2025: పదో తరగతి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

Tenth Class Exams 2025: పదో తరగతి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

ఈఏడాది మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. హనుమకొండ జిల్లాలో ఏ పాఠశాలలో సిలబస్‌ పూర్తి కాలేదో అక్కడ పూర్తి చేయాలని హెచ్‌ఎంలను సంబంధిత విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఇటీవల జిల్లా స్థాయిలో హెచ్‌ఎంల సమావేశాన్ని నిర్వహించి వారికి 40 రోజుల ప్రత్యేక కార్యాచరణను అందజేశారు. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి ఈ విద్యా సంవత్సరంలో 12,006 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డీఈఓ ఆదేశించారు. ఆదిశగా పాఠశాలల్లో కార్యాచరణ మొదలైంది.

ఇదీ చదవండి: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా షెడ్యూల్‌ ఇదీ..

ప్రతీ పాఠశాలకు బుక్‌లెట్‌..

జిల్లాలోని వివిధ స్థాయిల్లో విద్యార్థుల స్థితిగతులను ఆధారం చేసుకుని నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో ఒకరోజు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టుకు రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాల పట్టికను (బుక్‌లెట్‌) రూపొందించారు. సబ్జెక్టుపరంగా ఏయే కాన్సెప్టులపై అత్యధిక శ్రద్ధ పెట్టాలి? అనే అంశాలను క్రోడీకరిస్తూ, సబ్జెక్టువారీగా అంశాలను నిర్ధారించారు. దీనికి సంబంధించి ప్రతీ పాఠశాలకు ఒక హార్డ్‌ కాపీని (బుక్‌లెట్‌)అందించారు.

ఇదీ చదవండి:    తెలంగాణ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. స్టడీ మెటీరియల్స్‌, మోడల్‌ పేపర్ల కోసం క్లిక్‌ చేయండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags