SA-1 Examination: ఎస్‌ఏ–1 పరీక్షపరిశీలనకు కమిటీలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఎస్‌ఏ–1 పరీక్షల పరిశీలనకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇందులో ప్రతి కాంప్లెక్స్‌ పరిధిలోని హెచ్‌ఎం, ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు కాంప్లెక్స్‌ పరిధిలో ఉండే ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. ఎస్‌ఏ– 1 సోషల్‌ పేపర్‌ ప్రశ్నపత్రం లీకవడంపై అక్టోబర్ 25న ‘సాక్షి’లో ‘ఎస్‌ఏ–1 ప్రశ్నపత్రం లీక్‌’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

చదవండి: Supreme Court: వయసు నిర్ధారణకు ‘ఆధార్‌’ ప్రామాణికం కాదు

ఈ కథనంపై విద్యాశాఖ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు డీఈఓ రవీందర్‌ తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో పరీక్ష సమయానికి ప్రారంభమైందా.. ప్రశ్నపత్రాలు పరీక్ష కంటే ముందే ఓపెన్‌ చేస్తున్నారా.. ఎంత సమయం పరీక్ష నిర్వహిస్తున్నారు.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు చెప్పారు.

అలాగే గురువారం సోషల్‌ పరీక్ష ప్రశ్నపత్రం సోషల్‌ మీడియాలో పోస్టులు చేసిన పలువురిని గుర్తించినట్లు తెలుస్తుంది. వీరికి శనివారం నోటీసులు ఇచ్చి, సోషల్‌ మీడియాలో ప్రశ్నపత్రాలు పోస్టు చేయడానికి కారణా లను తెలుసుకుంటామని డీఈఓ వివరించారు. ప్రధానంగా ఏ పాఠశాల నుంచి లీక్‌ అయ్యిందో ఆరాతీస్తున్నట్లు సమాచారం.

#Tags