Telangana: మినీ అంగన్‌వాడీలకు మహర్దశ

కరీంనగర్‌: ఏళ్లుగా నిరీక్షిస్తున్న మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
మినీ అంగన్‌వాడీలకు మహర్దశ

 గతంలో వెయ్యి మంది జనాభా ఉన్న ప్రాంతానికి ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లబ్దిదారులకు పలు రకాల సేవలందిస్తున్నారు. కాగా వెయ్యి లోపు జనాభా ఉండి ప్రధాన కేంద్రాలకు దూరంగా ఉన్న అబాది గ్రామాలు, శివారు కాలనీ ప్రజల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో 2014 వరకు మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అయితే ఆ కేంద్రాల్లో ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే విధులు నిర్వహించాల్సి రావడంతో నాణ్యమైన సేవలు అందించడం కష్టంగా మారింది. ఆయా కేంద్రాలను అ ప్‌గ్రేడ్‌ చేసేందుకు గతేడాది ప్రతిపాదనలు పంపగా ఇటీవలనే ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ కలగనుంది.

చదవండి: పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు ఈ–పోస్‌...

జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు.. 777 అంగన్‌వాడీ కేంద్రాలు

కుటుంబ సర్వే ఆధారంగా అంగన్‌వాడీల నివేదికలు అందజేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో నాలుగు ప్రాజెక్ట్‌లోని మినీ అంగన్‌వాడీల పరిధిలో గల కుటుంబాల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కొనసాగుతున్న 25 మినీ సెంటర్లు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఆయా కేంద్రాలకు ఆయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. దీంతో ఇప్పటి వరకు అటు గర్భిణులు, బాలింతలతో పాటు ఇటు చిన్నారులకు సేవలందించడంలో అంగన్‌వాడీ టీచర్లపై పడుతున్న భారం తగ్గి వారికి వేతనం కూడా పెరగనుంది.

జిల్లాలోని కరీంనగర్‌ అర్బన్‌, రూరల్‌, గంగాధర, హుజూరాబాద్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. వీటిలో 752 మెయిన్‌ , 25 మినీ సెంటర్లు ఉ న్నాయి . కరీంనగర్‌ రూరల్‌లో 3, కరీంనగర్‌ అర్బన్‌లో 4, హుజూరాబాద్‌ పరిధిలో 18 మినీ కేంద్రాలున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కుటుంబ సర్వే ఆధారంగా ఒక్కో మినీ సెంటర్‌ పరిధిలో 400కు పైగా కుటుంబాలు ఉండడంతో వాటిని కూడా మెయిన్‌ సెంటర్లుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

దశాబ్దంన్నర క్రితం ఆయా ప్రాంతాల్లోని జనాభా ప్రకారం రెవె న్యూ గ్రామాలకు దూరంగా ఉన్న చోట మినీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాలక్రమేణ జనాభా పెరుగడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బలవర్ధకమైన పోషకాహారంతో క్రమేపి మినీ కేంద్రాల్లో కూడా బాలింతలు, గర్భిణులు, చి న్నారుల సంఖ్య పెరిగింది. మినీ కేంద్రాలకు కేవలం ఒకే టీచరును కేటాయించగా వీరందరికీ సేవలందించడం ఇబ్బందిగా మారింది. దీనిని గమనించిన ప్రభుత్వం వీటిని అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు చేపట్టి ప్రతిపాదనలు పంపాలని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది.

కేంద్రాల పెంపుతో ఆయాలు కూడా పెరిగి అంగన్‌వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సేవా సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఆ యా కేంద్రాల్లోని టీచర్లకు వేతనం కూడా పెరుగనుంది. ప్రస్తుతం వారి వేతనం రూ.7,,300 చె ల్లిస్తుండగా, మెయిన్‌ సెంటర్‌గా మార్పు చెందితే రూ.19,850 వరకు వేతనం పెరిగే అవకాశం ఉంది.

#Tags