Navodaya Admissions: నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేట రూరల్‌: వర్గల్‌ జవహర్‌ నవోదయలో చదివేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ మనుచౌదరి తెలిపారు.

2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై పరీక్షకు హాజరయ్యేందుకు ఉమ్మడి మెదక్‌జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చదవండి: Navodaya Vidyalaya : న‌వోదయ విద్యాల‌య‌లో చేరితే బంగారు భ‌విష్య‌త్తు.. ప్ర‌వేశానికి మాత్రం!

విద్యార్థులు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే చదువుతూ, తల్లిదండ్రులు కూడా ఇక్కడే నివాసమై ఉండాలన్నారు. సెప్టెంబర్‌ 16వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

#Tags