Half day Schools: ఒంటిపూట బడులు ప్రారంభం.. స్కూల్ టైమింగ్స్‌లల్లో కీలక మార్పులు

జనగామ రూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు నేటి(మార్చి 14) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్ల డించారు.

జిల్లాలో 508 ప్రాథమిక, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలల్లో 36వేల పైచిలుకు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని స్పష్టం చేశా రు.

పదో తరగతి పరీక్షలు ఉన్న కేంద్రాల్లో మధ్యాహ్నం 1గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పాఠశాల నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసైన్‌మెంట్‌, ప్రాజెక్టు వర్కులు చేయించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఈఏడాది పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. ఆయా సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులకు తెలియజేయాని తెలిపారు.

విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలను తీసుకుని పాఠశాల్లో బుక్‌ బ్యాంక్‌లో భద్రపరిచి నూతన పాఠ్యపుస్తకాలను తరగతుల వారీగా ఆన్‌లైన్‌ చేసి, పాఠశాల యాజమాన్య కమిటీ సమక్షంలో పంపిణీ చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు

సంఖ్య

విద్యార్థులు

ప్రాథమిక

341

15,987

ప్రాథమికోన్నత

64

5,696

ఉన్నత

103

14,149

మొత్తం

 508

36,965

#Tags