PM – Usha Scheme: ఎస్కేయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు.. వర్సిటీలో మరమ్మత్తులు, నిర్మాణాలు ఇలా..!
రాబోయే తరాలకు భరోసానిచ్చేందుకు ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. తద్వారా ఎస్కేయూకు మరిన్ని సొబగులు రానున్నాయి.
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యాశాఖ అండగా నిలిచింది. రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) తాజాగా పీఎం– ఉష పథకం నుంచి రూ.20 కోట్ల నిధులు వర్సిటీకి వెచ్చించారు. న్యాక్ (ద నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) గ్రేడింగ్‌ను బట్టి యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తారు. న్యాక్ బీ గ్రేడ్ హోదాలో ఎస్కేయూ ఉండడంతో రూ.20 కోట్ల నిధులు ఖర్చు పెట్టడానికి వీలు కలిగింది. వచ్చే మూడు విద్యా సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని ప్రణాళిక అంశాల వారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఖర్చు చేయలేకపోతే నిధులు వెనక్కి తీసుకుంటారు. గతంలో రూ.20 కోట్ల నిధులు పూర్తిగా ఖర్చుచేసి ఇందుకు సంబంధించిన వినియోగితా పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించారు. దీంతో తాజాగా మరో రూ.20 కోట్ల నిధులు జమ అయ్యాయి.
Education Schemes for Schools: మనబడి నాడు-నేడుతో పాఠశాలల అభివృద్ధి..!
భవనాల నిర్మాణాలకు రూ.5.75 కోట్లు
నూతన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ భవనం నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. వర్సిటీలో కాంపిటేటివ్ సెల్ అందుబాటులో ఉంది. అయితే ఈ భవనానికి పైన మరో అంతస్తు నిర్మాణానికి అనుమతి మంజూరైంది. ఇందుకు మరో రూ.50 లక్షలు ఖర్చు చేస్తారు. లాన్, వైఫై సర్వర్ రూం నిర్మాణానికి రూ.25 లక్షలు వెచ్చించారు. మొత్తం రూ.5.75 కోట్ల మొత్తంతో నూతన భవన నిర్మాణాలు చేస్తారు.
పరికరాల కొనుగోలుకు రూ. 9.60 కోట్లు
సెంట్రల్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఎయిర్ కండీషనింగ్‌కు రూ.12,82 లక్షలు, హెచ్‌పీఎల్‌సీ సిస్టమ్‌కు రూ.30.68 లక్షలు, నానో డ్రాప్ స్పెక్ట్రోమీటర్ రూ.16.28 లక్షలు, రీసెర్చ్ మోడల్ విత్ కంప్రెసర్ రూ.27.14 లక్షలు, డీఎస్ అడ్వాన్స్ ఎక్స్–రే డిఫ్రాక్రోటమీటర్ రూ.65.18 లక్షలు, ఎల్‌సీఆర్ అనలైజర్ రూ.15.87 లక్షలు, స్టాన్‌ఫర్డ్ లాక్ ఇన్ ఆమ్లిఫైర్ రూ.10.03 లక్షలు కేటాయించారు. అలాగే 25 టీబీ స్టోరేజ్ సర్వర్స్‌కు రూ.14 లక్షలు, డెస్క్‌టాప్ కంప్యూటర్స్ రూ.19.92 లక్షలు, ఆడిటోరియం సౌండ్ సిస్టమ్‌కు రూ.45 లక్షలు, స్పీకర్ ట్రాకింగ్ కెమెరాలు రూ.2.50లక్షలు, పబ్లిక్ ఆడియో సిస్టమ్ రూ.3.24 లక్షలు వెచ్చించనున్నారు.
Tesla Company Layoffs: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
స్మార్ట్ క్లాస్ రూమ్‌లు రూ.50 లక్షలు, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రూ.1.24 కోట్లు, 3కేవీఏ ఆన్‌లైన్ యూపీఎస్ ఇంటారాక్టివ్ ప్యానల్స్ రూ.18.75 లక్షలు, ఒలంపస్ సిస్టమ్ మైక్రోస్కోప్ రూ.11.03 లక్షలు కేటాయించారు. పరీక్ష భవన్‌లో సెంట్రల్ ఆడియో సిస్టమ్‌కు రూ.5 లక్షలు, కంప్యూటర్ చైర్స్ రూ.2.10లక్షలు, కంప్యూటర్ టేబుల్స్ రూ.3.90 లక్షలు, నెట్వర్క్ అప్‌గ్రేడేషన్ రూ. 1.10 కోట్లు, సోలార్ ఎనర్జీ ఫర్ గ్రీన్ క్యాంపస్ రూ. 3.76కోట్లు మొత్తం రూ. 9.65 కోట్లు ఉపకరణాలకు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు సాఫ్ట్ కాంపోనెంట్‌కు రూ.2.10 కోట్లు కేటాయించారు.
Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఆమోదం!
మరమ్మతులు
భువన విజయం ఆడిటోరియం మరమ్మతులకు రూ.1.50 కోట్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సెక్షన్ కంప్యూటర్ సెంటర్ మరమ్మత్తులు రూ. 50 లక్షలు, శబరి గెస్ట్ హౌస్ మరమ్మతులకు రూ. 50 లక్షలు కేటాయించారు. మరమ్మత్తులకు మొత్తం 2.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Rabindranath Tagore Birthday: నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు.. ఈయన జీవిత చరిత్ర ఇదే..
Tags
- Sri Krishnadevaraya University
- Funds
- development
- NAAC Grade
- PM USHA scheme
- students education
- facilities at college
- usage of funds for college
- repairs in SKU
- electronic gadgets
- Department of Education
- Rashtriya Uchhatar Shiksha Abhiyan
- Utilization Certificates
- Education News
- Sakshi Education News
- ananthapur news
- SKU Development Funds
- HigherEducation
- FutureGenerations
- FundsAllocation
- UniversityFunding
- EducationInitiatives
- AcademicYears
- PMUSHA