Telangana: గురుకులాలను పటిష్టం చేయాలి

విద్యారణ్యపురి: తెలంగాణలోని వివిధ గురుకుల పాఠశాలల పటిష్టానికి పాటుపడాలని తెలంగాణ గురుకులాల ప్రిన్సిపాల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

డిసెంబ‌ర్ 7న‌ హనుమకొండ టీజీపీఏ కార్యాలయంలో ఆ అసోసియేషన్‌ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రకటించి పెండింగ్‌లో పెట్టిన మెస్‌ చార్జీలను వెంటనే అమలు చేయాలన్నారు. అన్ని గురుకుల పాఠశాలలను కలిపి కామన్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని, గురుకుల విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు.

చదవండి: Avula Sampath: విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలి

సమావేశంలో టీజీపీఏ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జి.భిక్షపతి, కార్యదర్శి గండ్ర శ్రీకాంత్‌, ఉమెన్‌ సెక్రటరీ తాళ్ల నీలిమాదేవి, ఉపాధ్యక్షురాలు ముత్తిరెడ్డి నీరజ, కార్యవర్గ సభ్యులు కుమారస్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Telangana: గురుకులంలో ఏం జరుగుతోంది..?

#Tags