Skip to main content

Avula Sampath: విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలి

హుజూరాబాద్‌రూరల్‌: విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలని జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ ఆవుల సంపత్‌ అన్నారు.
District Child Helpline Coordinator emphasizing goals to students. Motivational speech for students by Avula Sampath, Students should be goal oriented, Avula Sampath guiding students towards their goals,

హుజూరాబాద్‌ పట్టణ శివారులోని బోర్నపల్లిలో గల సైదాపూర్‌ మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు న‌వంబ‌ర్ 4న‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలై, జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

చదవండి: ServiceNow: ఏఐ నైపుణ్యాల పెంపు అత్యావశ్యకం

అనంతరం ఓటు విలువను తెలియజేశారు. ఏదైనా సమస్య ఉంటే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098లో సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రవీందర్‌, ఐసీపీఎస్‌ లీగల్‌ ఆఫీసర్‌ రాజు, కౌన్సిలర్‌ తేజస్విని, సోషల్‌ వర్కర్‌ రమేశ్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 సూపర్‌వైజర్‌ కుమారస్వామి, ఔట్‌ రీచ్‌ వర్కర్స్‌ రమేశ్‌, స్వప్న, పోషన్‌ అభియాన్‌ రోమిలా, మహిళా శక్తి శైలజ, రోహిణి తదితరులు పాల్గొన్నారు.

Published date : 06 Nov 2023 03:28PM

Photo Stories