Skip to main content

Telangana: గురుకులంలో ఏం జరుగుతోంది..?

మద్నూర్‌(జుక్కల్‌) : మద్నూర్‌ మండలంలోని పెద్ద ఎక్లారా గేట్‌ వద్ద బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో జరుగుతున్న సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Telangana
గురుకులంలో ఏం జరుగుతోంది..?

గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని శిరీష క్యాంపస్‌లోని వాటర్‌ట్యాంక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడగా అక్టోబ‌ర్ 31న‌ మరో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని వసుధ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది.

చదవండి: గురుకుల మహిళా కళాశాలలో రెండు పీజీ కోర్సులు

ఈ సంఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు గురుకుల కళాశాలలో ఏం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి విద్యార్థినుల క్షేమాన్ని పరిగణలోకి తీసుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

Published date : 01 Nov 2023 12:56PM

Photo Stories