School Exams: షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి

నెక్కొండ: షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ (ఏఎంఓ) సారయ్య సూచించారు.

మండలంలోని పెద్దకొర్పోలు కస్తూర్బా గురుకుల విద్యాలయం, స్థానిక హైస్కూల్‌, గౌతమి విద్యానికేతన్‌ హైస్కూల్‌ను ఏప్రిల్ 16న‌ ఆయన సందర్శించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఏరోజు ప్రశ్నపత్రాలను అదేరోజు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ప్రశ్నపత్రాలను లీక్‌చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 23 వరకు మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థులకు ప్రగతిపత్రాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అనంతరం స్థానిక ఎమ్మార్సీ భవనాన్ని ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఎంఎన్‌ఓ రవికుమార్‌, హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ రంగారావు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

#Tags