Sports School: స్పోర్ట్స్‌ స్కూల్‌లో సౌకర్యాల కల్పనకు కృషి

ఆదిలాబాద్‌ టౌన్‌: స్పోర్ట్స్‌ స్కూల్‌లో సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు.

జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలను జూలై 22న‌ ఆయన సందర్శించారు. అక్క డ ఉన్నసౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

చదవండి: Sohanvika: బంగారు పతకం సాధించిన తొమ్మిదేళ్ల ఏపీ బాలిక.. ఎందులో అంటే..

ఉపాధ్యాయులు, సిబ్బంది కొరతతో నాణ్యమైన బోధన అందకుండా పోతుందని పేర్కొన్నారు. రెగ్యూలర్‌ సిబ్బంది ని యామకం విషయాన్ని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఎండీ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

#Tags