School Admisssions: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు

ఆదిలాబాద్‌ రూరల్‌: 2024–25 విద్యా సంవత్సరానికి బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో 1వ తరగతి (డే స్కాలర్‌), 5వ తరగతి (రెసిడెన్షియల్‌)లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 1వ తరగతిలో 45 సీట్లు, ఐదో తరగతిలో 47 సీట్లు ఉన్నట్లు తెలి పారు.

చదవండి: Subject Teachers: స‌బ్జెక్టు ఉపాధ్యాయుల‌కు రెండు రోజుల శిక్ష‌ణ‌..!

వార్షిక ఆదాయం గ్రామీణ స్థాయిలో రూ.లక్షా 50వేలు, పట్టణ స్థాయిలో రూ.2 లక్షల ఉండాలన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్‌ అధికారిచే అటెస్ట్‌ చేసి జూన్‌ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాల కోసం 9440628538 నంబరులో సంప్రదించాలని సూచించారు.
 

#Tags