TUTF: విద్యాశాఖకు నిధుల కేటాయింపు హర్షనీయం

ఆదిలాబాద్‌ టౌన్‌: బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధులు కేటాయించడం హర్షనీయమని టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చి రాం అన్నారు.

ఆగ‌స్టు 8న‌ జిల్లా కేంద్రంలో ని సంఘ భవనంలో నిర్వహించిన టీయూటీఎఫ్‌ 14వ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బేర దేవన్నతో కలిసి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బదిలీ, పదోన్నతులు చేపట్టడంపై టీయూటీఎఫ్‌ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు.

చదవండి: Free Training: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, పీఆర్సీ కమిటీకి అందించే నివేదిక త్వరలో అందజేసేలా చూడాలని, ఉద్యోగులందరికీ పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సహాధ్యక్షుడు ఆర్‌.సుజాత, సంయుక్త కార్యదర్శి ఆర్‌.రామారావు, ఆడిట్‌ కమిటీ సభ్యులు గండ్రత్‌ నారాయణ, ఎస్‌.శ్రీకాంత్‌, జలంధర్‌ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

#Tags