TS TET Exam Conduct Before DSC 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. డీఎస్సీ-2024 కంటే.. ముందే టెట్ ప‌రీక్ష‌.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చేపింది. డీఎస్సీ-2024 పరీక్షల కంటే ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) పరీక్ష నిర్వహించనున‌న్న‌ది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో అద‌నంగా మ‌రో 3 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు డీఎస్సీ ప‌రీక్ష రాసేందుకు వీలు క‌ల‌గ‌నుంది.

టెట్ అర్హత లేని కారణంగా..

తాజాగా బీఈడీ, డీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ప్ర‌భుత్వంకు ఈ విష‌యంపై విన్న‌పించిన విష‌యం తెల్సిందే. ఇంతకుముందు టెట్ పరీక్ష రాసినప్పటికీ అర్హత సాధించని వారు.. తాజాగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న దాదాపు 50 వేల మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. అలాగే కేవలం టెట్ అర్హత లేని కారణంగా టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు. కావున నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే టెట్ నిర్వహించి.., త‌ర్వాత‌ డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని ప్ర‌భుత్వ‌నాకి లేఖ రాసిన విష‌యం తెల్సిందే.

☛ TS DSC 2024 District Wise Posts Details : జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ముఖ్య‌మైన తేదీలు ఇలా..

11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి..ఇటీవలే 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సర్కారు. అయితే గతంలో డీఎస్సీకి ముందు టెట్‌ను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు టెట్‌ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో గతంలో టెట్‌ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవలి కాలంలో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తిచేసినవారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. ఇటీవలే అభ్యర్థులంతా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ (డీఎస్‌ఈ)ను ముట్టడించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమ ఆందోళలను తీవ్రతరం చేశారు. ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం స్పందించ‌డంతో అభ్య‌ర్థుల ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.గతంలో క్వాలిఫై కాక మరో చాన్స్‌ కోసం వేచిచూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఈ  నిర్ణయం ఎంతో మందికి ఊర‌ట ఇచ్చింది. 

☛ School Assistant Exam 2024 Syllabus & Exam pattern : తెలంగాణ‌లో 2629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. సిల‌బ‌స్ ఇదే..

ఐదేండ్ల తర్వాత..
గతంలో నిర్వహించిన టెట్‌కు వివిధ కారణాల వల్ల అనేకమంది గైర్హాజరయ్యారు. 2 లక్షల మంది దాకా అర్హత సాధించలేదు. వారితో పాటు కొత్తగా ఉత్తీర్ణులైనవారితో కలిపి సుమారు 4 లక్షల మంది టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో ఒకసారి టెట్‌ జరిగింది. ఆ తర్వాత 2017లో టెట్‌ నిర్వహించి, టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఐదేండ్ల తర్వాత 2022 జూన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. 2023 ఆగస్టులో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించారు. పేపర్‌-1కు 2,23,582 మంది హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్‌-2కు 1,90,047 అభ్యర్థులు హాజరవగా 29,073 (15.30 శాతం) మంది అర్హత సాధించారు.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

బీఎడ్‌ ఫైనల్‌ ఇయర్‌, ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్నవారు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిచ్చారు. డీఎడ్‌ రెండో సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నాటికి అన్ని రకాల అర్హతలనూ పొంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కానీ టెట్‌ విషయానికి వచ్చేసరికి టెట్‌లో అర్హత సాధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేనాటికే టెట్‌లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపుగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో టెట్‌ మార్కులు అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధన విధించారు.

#Tags