విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు?
1. శిశువు మొదట పురుషులందరిని ’నాన్న’ అని, స్త్రీలందరిని ‘అమ్మ’ అని తర్వాత ఈ మాటలను తన సొంత అమ్మ, నాన్నలకే పరిమితం చేయడంలో కన్పించే వికాస సూత్రం ?
1) వికాసం క్రమానుగతమైంది.
2) వికాసం సంచితమైంది
3) వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది
4) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట ప్రతి స్పందనలకు పయనిస్తుంది.
- View Answer
- సమాధానం: 4
2. తన మేధస్సును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడిస్ ‘యురేకా’ అని అరవడం ఏ అభ్యసనా సిద్ధాంతంలో కనిపిస్తుంది?
1) యత్న దోష అభ్యసన ిసిద్ధాంతం
2) అంతర దృష్టి అభ్యసన సిద్ధాంతం
3) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
4) కార్యసాధక నిబంధనం
- View Answer
- సమాధానం: 2
3. టెన్నిస్ ఆడుతూ స్క్వాష్ ఆడటం మొదలు పెట్టిన క్రీడాకారుడు టెన్నిస్ ఆడటం మర్చిపోవడమనేది?
1) తిరోగమన అవరోధం
2) పురోగమన అవరోధం
3) ప్రేరేపిత విసృ్మతి
4) ఉద్వేగాత్మక కలత
- View Answer
- సమాధానం: 1
4. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు?
1) విల్ హెమ్ ఊంట్
2) విలియం జేమ్స్
3) జాన్ ఫ్రెడ్రిచ్ హెర్బర్ట్
4) బి.ఎఫ్. స్కిన్నర్
- View Answer
- సమాధానం: 3
5. అకారాలను ప్రకార్యాలను సమైక్యంచేసి విశదపర్చే సంక్లిష్ట ప్రక్రియే వికాసమన్నది ఎవరు?
1) అండర్సన్
2) గెసెల్
3) క్రైగ్
4) ఉడ్వర్త
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో అభ్యసన లక్షణం కానిదేది?
1) అభ్యసనం సార్వత్రికం
2) అభ్యసనం ప్రక్రియేగాని ఫలితం కాదు
3) అభ్యసనం సంచితమైంది
4) పరిణతి వలన కలిగే మార్పులు
- View Answer
- సమాధానం: 4
7. కిషోర్ అనే విద్యార్ధి తరగతి గదిలో విచారంగా మందకోడిగా ఉండి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. హిప్పోక్రేటిస్ ప్రకారం కిషోర్ ఏవర్గానికి చెందిన వాడు
1) ఔత్సాహికుడు
2) విషణ్ణువు
3) పైత్యప్రకృతి కలవాడు
4) శ్లేష్మ ప్రకృతి కలవాడు.
- View Answer
- సమాధానం: 2
8. Mesurement of Intelligence: Experiemental Studies గ్రంధ రచరుుత ఎవరు?
1) ఆల్ఫెడ్ర్ బిన్
2) గోల్మన్
3) ధారన్ డైక్
4) హో వర్డ్ గార్డనర్
- View Answer
- సమాధానం: 3
9. ఇంటికి తాళం వేసి పలుమార్లు లాగడం వంటి అర్ధరహిత పనులు చేయడాన్ని ఏమంటారు?
1) సైకోస్తీనియా
2) డిస్గ్రాఫియా
3) ఆగ్రాఫియా
4) డిస్ ఫేసియా
- View Answer
- సమాధానం: 1
10.ఉద్దీపనల తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణను ఏమంటారు?
1) జైగార్నిక్ ఎఫెక్ట్
2) హాలో ఎఫెక్ట్
3) వాన్ రెస్టార్ఫ
4) ప్రాగ్నాంజ్
- View Answer
- సమాధానం: 4
11. తల్లిని చూసి ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేయడం నేర్చుకున్న అమ్మారుుని తక్షణమే అభినందించడమనేది ?
1) స్వీయ పునర్బలనం
2) ప్రత్యక్ష పునర్బలనం
3) పరోక్ష పునర్బలనం
4) ప్రత్యక్ష, పరోక్ష పునర్బలనం
- View Answer
- సమాధానం: 2
12. పాఠశాలలోని విద్యార్థులు చట్టం, ధర్మం, ప్రకారం నడుచుకోవాలని భావించడం కోల్ బర్గ్ సాంప్రదాయం నైతిక స్థారుులోని ఏదశను చూపిస్తుంది?
1) నాల్గో దశ
2) మూడో దశ
8) రెండో దశ
4) మొదటి దశ
- View Answer
- సమాధానం: 1
13. రోషాక్ సిరా మరకల పరీక్షలో నిర్ణాయకం కానిది ఏది?
1) రంగు
2) రూపం
3) కదలిక
4) జంతుభాగాలు
- View Answer
- సమాధానం: 4
14.ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం విద్యార్థులు కౌమార దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట స్థితి?
1) శ్రమ-న్యూనత
2) సాన్నిహిత్యం - వేర్పాటు
3) ఉత్పాదకత - స్తబ్దత
4) గుర్తింపు - పాత్ర గందరగోళం
- View Answer
- సమాధానం: 4
15. రమేష్ సైకిల్ తొక్కడం తెలుసు కాని గురుత్వకేంద్ర భావనను అర్ధం చేసుకోలేడు. జీన్ ిపియాజె సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్ ఏదశకు చెందినవాడు?
1) ఇంద్రియ చాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: 3
16. కింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిదేది?
1) ఆర్మీ బీటా పరీక్ష
2) ఆర్మీ ఆల్ఫా పరీక్ష
3) డ్రా ఎ పర్సన్ టెస్ట్
4) ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష
- View Answer
- సమాధానం: 2
17.పిల్లలకు భాషార్జన సామర్ధ్యం పుట్టుక తోనే ఉంటుంది. దీనినే ‘గవర్నమెంట్ బైండింగ్’ సిద్దాంతం అని చెప్పిన బాషా వికాస సిద్ధాంత కర్త ఎవరు?
1) నోమ్ చోమ్స్కీ
2) హాలిడే
3) సీషోర్
4) అల్బర్ట్ బండూర
- View Answer
- సమాధానం: 1
18.ఏ వయస్సులో శిశువులో అసూయ ఏర్పడుతుంది?
1) 3 నెలలు
2) 6 నెలలు
3) 12 నెలలు
4) 18 నెలలు
- View Answer
- సమాధానం: 3
19. క్లాస్లో ఎప్పుడు సమాధానం చెప్పే రాజేష్ హఠాత్తుగా సమాధానం తెల్సినా చెప్పడం మానేశాడు. అబ్రహాం మాస్లో ప్రకారం రాజేష్ ఏ అవసరం కోసం పరితపిస్తున్నాడు?
1) ఆత్మ ప్రస్థావన
2) గుర్తింపు
3) ప్రేమ
4) రక్షణ
- View Answer
- సమాధానం: 2