Teacher Job Vacancies : 10 లక్షలకుపైగా టీచర్ల పోస్టులు ఖాళీలు.. ఈ కొరతను నివారించాలంటే..
ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫామింగ్ హ్యూమన్ కేపిటల్) నివేదిక తెలిపింది.
ఇంత భారీగా ఖాళీలను..
రాష్ట్రాల్లో 30 నుంచి 50% వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కొరతను నివారించడానికి అదనపు టీచర్ కేడర్ సృష్టించి పెద్దఎత్తున ఖాళీల భర్తీ చేపట్టాలని పేర్కొంది. దీనికి తోడు ఉన్న టీచర్లను సమపద్ధతిలో పంపిణీ చేయలేదు. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక టీచర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇంత భారీ ఖాళీలతో ఉన్నత ఫలితాలు సాధించలేం. ఈ సమస్యను పరిష్కరించడం అంత సులభమేమీ కాదు. ఇది రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. దాన్ని భరించే శక్తి రాష్ట్రాలకు లేదు. దీనికి తోడు నియామక ప్రక్రియలో సంక్లిష్టత, న్యాయపరమైన సవాళ్లు, ఖాళీల భర్తీకి అడ్డంకిగా ఉన్నాయి.
☛ AP &TS డీఎస్సీ స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్, ఆన్‌లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతాలు ప్రైవేటు రంగంలో అత్యుత్తమ టీచర్లకు చెల్లించే వేతనాల కంటే రెండురెట్లు అధికంగా ఉంటున్నాయి. అందువల్ల ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలి. పట్టణప్రాంతాల్లో అధికంగా ఉన్న ఉపాధ్యాయుల్ని గ్రామీణ ప్రాంతాలకు పంపాలి. అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2-5 లక్షలమంమందికి సరైన శిక్షణ లేదు. దానివల్ల విద్యాహక్కు చట్టం లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు” అని ఈ నివేదిక వెల్లడించింది.
ఈ రాష్ట్రాల్లోని..
థర్డ్-పార్టీ మదింపుదారుల ద్వారా విద్యలో నాణ్యతను అంచనా వేయడం, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (ECE) అమలు చేయడం, రాష్ట్రాల విద్యా శాఖలలో పాలనా యంత్రాంగాలను బలోపేతం చేయడం వంటి ఇతర పద్ధతుల ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేయవచ్చని అభిప్రాయపడింది.ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాత్ అమలు కింద తొమ్మిది అంశాల విశ్లేషణ ఆధారంగా నివేదికను రూపొందించింది. విద్యలో నాణ్యతను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మూడు రాష్ట్రాలల్లో 2017 నుంచి 2022 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ రాష్ట్రాల్లోని రెండు లక్షల పాఠశాలల్లోని రెండు కోట్ల మంది విద్యార్థులపై సాత్ ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. నీతి-ఆయోగ్ నాలెడ్జ్ భాగస్వాములు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), పిరమల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ (PFEL) ఈ ప్రాజెక్ట్‌ను అమలకు సహకరించాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో 50 మందిలోపు..
భారత్‌లో చైనా కంటే ఐదు రెట్లు ఎక్కువ పాఠశాలల ఉన్నాయని, అనేక రాష్ట్రాల్లో 50% కంటే ఎక్కువ ప్రాథమిక పాఠశాలల్లో నమోదు శాతం 60 కంటే తక్కువ ఉందని స్పష్టం చేసింది. అలాగే దేశంలో సగటున ఓ పాఠశాలలో 50-60 మంది విద్యార్థులు, ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఇదే ప్రయివేట్ పాఠశాలల్లో 265 మంది విద్యార్థులకు 9 మంది టీచర్లు ఉన్నారు. దాదాపు 4 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 50 మందిలోపు విద్యార్థులు, ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.
ఈ కొరతను నివారించడానికి..
భారత దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రాల్లో 30 నుంచి 50% వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కొరతను నివారించడానికి అదనపు టీచర్ కేడర్ సృష్టించి పెద్దఎత్తున ఖాళీల భర్తీ చేపట్టాలని సూచించింది.
అలాగే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలి. పట్టణాల్లో అధికంగా ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాలకు పంపాలి. అవసరమైన ప్రోత్సాహకాలు అందజేయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2-5 లక్షల మందికి సరైన శిక్షణ లేదు. దానివల్ల విద్యాహక్కు చట్టం లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు’అని ఈ నివేదిక వెల్లడించింది. పాఠశాలల విలీనం కొనసాగించాలని పేర్కొంది.
సాత్ అమలైన ఝార్ఖండ్‌లో 4,380 పాఠశాలలను విలీనం చేయడం వల్ల టీచర్లు, మౌలిక వసతుల ఖర్చు తగ్గి రూ.400 కోట్ల మేర ఆదా అయ్యింది. దీని వల్ల సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించారు. మధ్యప్రదేశ్‌లో 35 వేల పాఠశాలలను విలీనం చేశారు. దీంతో అక్కడ పాఠశాలల సంఖ్య 16,000కు తగ్గినందున 55% పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. దీనికి ముందు కేవలం 20% మాత్రమే ఉంది. ఒడిశాలో 2,000 పాఠశాలలు ఒకే క్యాంపస్ పాఠశాలల్లో విలీనం జరిగింది. ఇది తదుపరి విలీనాలకు మార్గనిర్దేశం చేసేందుకు పారదర్శక రాష్ట్ర విధానం, నిబంధనలను రూపొందించడంలో సహాయపడిందని తెలిపింది.