Vidya Volunteers Jobs Notification 2024 : నెలకు రూ.12 వేలకు పైగా జీతంతో.. 15000 విద్యా వాలంటీర్ల పోస్టులు.. భర్తీ ఇలా..!
ఇందుకోసం ప్రస్తుత ఖాళీల ప్రకారం దాదాపు 15 వేల మందిని నియమించే అవకాశం ఉంది.
జూన్ 11వ తేదీ నాటికి..
ఒక్క ఖాళీ లేకుండా విద్యా వాలంటీర్లను భర్తీ చేయాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. డీఎస్సీ ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు.
నెలకు రూ.15000 నుంచి రూ.20000 మధ్యలో జీతం..?
గతంలో పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది. దానివల్ల 15-30 రోజులపాటు బోధన కుంటుపడేది. ఈ సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగానే.. విద్యా వాలంటీర్ల ఉద్యోగాలను నియమించుకోనున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు వీరికి నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఈ సారి విద్యా వాలంటీర్లు రెవంత్‌రెడ్డి సర్కార్ రూ.15000 నుంచి రూ.20000 మధ్యలో జీతం ఇచ్చే అవకాశం ఉంది.