TS Government Jobs Notification 2024 : 1520 ఉద్యోగాలకు నోటిపికేష‌న్‌... ప‌రీక్ష తేదీలు ఇవే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం 1520 MPHW ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) ఉద్యోగాల‌కు సంబంధించిన ప‌రీక్షను డిసెంబ‌ర్ 29వ తేదీ నిర్వ‌హించ‌నున్న‌ది.

తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప‌రిధిలో ఈ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ది. ఈ ఉద్యోగాల‌ను ప్రభుత్వ హస్పిటల్‌ల‌లో ఖాళీగా వాటిలో భ‌ర్తీ చేయ‌నున్నారు. త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

#Tags