Singareni Job Notification: 173 పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్‌

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల(ఇంటర్నల్‌) భర్తీకి యాజమాన్యం మార్చి 7న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇందులో జూనియర్‌ మైనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు 87, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌) పోస్టులు 28, జూనియర్‌ టెక్నిక ల్‌ ఆఫీసర్‌ ఎలక్ట్రికల్‌ పోస్టులు 21, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సివిల్‌ 11 పోస్టులు, జూనియర్‌ ఆఫీసర్‌(ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌) నాలుగు పోస్టులు, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 4, బయోకెమిస్ట్‌ పోస్టు ఒకటి, జూనియర్‌ ఫారెస్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు 12తో పాటు జూనియర్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఐదు ఉన్నాయి.

చదవండి: Government Job Notifications: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..

ఆయా పోస్టుల కోసం మార్చి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఎం కట్టా బసవయ్య సూచించారు. 

చదవండి: JA Training Classes: జూనియర్‌ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు

#Tags