Postal Department: పోస్టల్‌ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

విద్యానగర్‌(కరీంనగర్‌): తపాలాశాఖ కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలో కమీషన్‌ పద్ధతిలో తపాలా జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్‌ డివిజన్‌ తపాలాశాఖ సూపరింటెండెంట్‌ కె.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి ఉత్తీర్ణులై, 18–50ఏళ్ల మధ్య ఉన్న కరీంనగర్‌ డివిజన్‌కు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగినవారు పూర్తిచేసిన దరఖాస్తులను కరీంనగర్‌ డివిజన్‌ ఆఫీస్‌లో డిసెంబ‌ర్ 18లోపు అందజేయాలని, ఎంపిక చేసిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

చదవండి: Bank Jobs 2023: ఐడీబీఐలో 2100 జేఏఎం, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఏజెంట్లుగా నియామకం అయినవారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని వివరాలకు సమీపంలోని పోస్టాఫీస్‌లో సంప్రదించాలని సూచించారు.

#Tags