Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వీరికి దసరా కానుకగా...
ఈ సందర్భంగా వీరు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా నాలుగు పెండింగ్ డీఏల గురించి కూడా ప్రస్తావించారు.
ప్రతి నెల 1వ తేదీనే..
మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కారు మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా ప్రతి నెలా ఫస్ట్ తారీఖునే జమ అవుతున్నది. దీనికి కొనసాగింపుగా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏలను జూలై-డిసెంబరు 2022, జనవరి-జూన్ 2023 విడుదల చేయాలనుకుంటున్నది.
☛ High court Order on TSPSC Group 4 Jobs : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశం...
ఈ మేరకు ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ (కరువు భత్యం)లలో రెండింటిని క్లియర్ చేయాలనుకుంటోంది. నవంబరు 1న అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ రెండు డీఏల అమౌంట్‌ను కూడా కలిపి ఇవ్వాలనే చర్చలు సెక్రటేరియట్‌లో జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తు చేస్తున్నది.
ఇంకెలాంటి ఆలస్యం చేయకుండానే..
ఒక్కో డీఏకు ఎంత భారం పడుతుందని, రెండింటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందనే లెక్కలు ఆఫీసర్లు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డీఏ (కరువు భత్యం)లు పెండింగ్‌లో పడ్డాయి. ఐదో డీఏ కూడా రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా రెండింటిని విడుదల చేయాలనే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
☛ Common Test For All Government Jobs : ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష.. రానున్న నోటిఫికేషన్‌లలో..!
రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని భావిస్తున్నది. జూలై-డిసెంబరు 2022, జనవరి-జూన్ 2023 డీఏలను 3.64 % చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటున్నది.
ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్‌ల కోసం దాదాపు రూ.4,800 కోట్ల చొప్పున ప్రతి నెలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తున్నది. ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన చేయనున్నది. రైతులకు రెండు లక్షల రుణమాఫీని రూ.8 వేల కోట్ల మేర ఒకే నెల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు రెండు డీఏలను ఇవ్వడంలో కష్టమేమీ కాదన్న సందేశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలనుకుంటున్నది. ఈ రెండింటిని క్లియర్ చేస్తే ఇంకా జూలై-డిసెంబరు 2023, జనవరి-జూన్ 2024 పెండింగ్‌లో ఉంటాయి. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించగానే రాష్ట్ర సర్కారు కూడా అదే లైన్‌లో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది.