Good News For Grama/Ward Sachivalayam Volunteers : శుభ‌వార్త‌.. గ్రామ‌/ వార్డు వాలంటీర్ల‌కు జీతాలు పెంపు.. ఎంతంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ గ్రామ‌/ వార్డు వాలంటీర్ల‌కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వ‌చ్చే నెల జ‌న‌వ‌రి నెల నుంచి వాలంటీర్ల జీతం పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి ఈ ప్రక‌ట‌న‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతం అదనంగా రూ.750 పెంచనున్నట్లు మంత్రి కారుమూరి చెప్పారు.

పెంచిన వేతనాన్ని వాలంటీర్లు వచ్చే నెల జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అందుకుంటారని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఏపీ గ్రామ‌/ వార్డు వాలంటీర్ల‌కు ప్ర‌భుత్వం నెల‌కు రూ.5000 గౌర‌వ‌వేత‌నం ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఏపీ రాష్ట్రవాప్తంగా గ్రామ‌/ వార్డు వాలంటీర్లు దాదాపు 2.30 ల‌క్ష‌ల మందిపైగా ప‌నిచేస్తున్న విష‌యం తెల్సిందే. ఈ పెంపుతో 2.30 ల‌క్ష‌ల గ్రామ‌/ వార్డు వాలంటీర్లల‌కు లబ్ధిచేకుర‌నున్న‌ది.

☛ Good News For Anganwadi Employees : ఏపీలో అంగన్వాడీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. కీల‌క ఉత్తర్వులు జారీ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ప్రజల సంక్షేమం కోసం వినూత్నమైన స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్‌ వరకు చాలా మంది గ్రామ‌/ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రయోజనం పొందుతూ ఉన్నారు.

గ్రామ‌/ వార్డు సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్యమైన కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వీటి పని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సర్వీసులు పొందడం వీలవుతుంది. సంక్షేమ పథకాల ప్రయోజాలు పొందొచ్చు. తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను వైఎస్ జగన్ ప్ర‌భుత్వం నిజం చేశారని చెప్పుకోవచ్చు.

☛ AP CM YS Jagan Mohan Reddy : దేశ చ‌రిత్ర‌లో.. రికార్డు స్థాయిలో ఒకే సారి ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన‌ ప్ర‌భుత్వం ఇదే..

గ్రామ‌/ వార్డు వాలంటీర్ల ద్వారా.. పౌరులకు కలిగే లాభాలు ఇవే..

☛ ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడం అనేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం. పథకం అమలు వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపడం.
☛ 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా పని చేస్తారు. గ్రామ సచివాలయాలతో అనుసంధానమై విధులు నిర్వర్తిస్తారు.
☛ ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలను కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే వీరికి సర్వీసులు అందిస్తారు. ప్రతి వాలంటీర్‌కు గుర్తింపు కార్డులు ఉంటారు.

ప్రజలకు ప్రభుత్వ పథకాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. ఎక్కడైనా వాలంటీర్ ఉద్యోగాల్లో ఖాళీలు ఏర్పడితే వెంటనే వాటిని అధికారులు భర్తీ చేస్తున్నారు.

☛ AP CM YS Jagan Mohan Reddy : చ‌రిత్ర‌లో ఎన్న‌డులేని విధంగా.. ఏపీ విద్యారంగంలో చేసిన విప్లవాత్మక మార్పులు ఇవే..

#Tags