Andhra Pradesh : కొత్తగా నియమితులైన 1,543 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా నియమితులైన 1,543 ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జూలై 17వ తేదీ (సోమ‌వారం) నియామక పత్రాలను అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందులో చదివే విద్యార్థుల భవిష్యత్తును బాధ్యతగా తీసుకొని.., వీరిని అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రోత్సాహించి.. వారిని ఉన్నతంగా తీర్చిద్దిద్దాలని మంత్రి సూచించారు.
Botsa Satyanarayana, AP Education Minister

అలాగే అణగారిన సామాజిక వర్గాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో నెలకొల్పబడిన పాఠశాలలే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 1,543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి  ఒకేసారి అనుమతిచ్చి ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.

Andhra Pradesh : ఇక‌పై ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వీరి స్థానంలో.. కొత్త‌గా..

టెన్త్‌, ఇంట‌ర్‌లో 100 శాతం..
ఇక్కడ చదివే విద్యార్థులు ప్రతి రంగంలో రాణించే దిశగా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల విద్య ప్రాధాన్యతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదనుగుణంగా విద్యాభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు వెచ్చించడమేగాకుండా వారి సాధికారతకు కృషి చేస్తోందన్నారు. కస్తూరిబా గాంధీ పాఠశాలలతో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు నేడులో భాగంగా బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం, కౌమర దశ బాలికలకు శానిటరీ నాప్ కిన్‌లు, రక్తహీనత లోపం లేకుండా పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. 

ప్ర‌వేశాల్లో వీరి అధిక ప్రాధాన్య‌త :

బడి మానేసిన పిల్లలకు, అనాధ పిల్లలకు, పాక్షిక అనాధ పిల్లలకు, దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల పిల్లలకు, దారిద్ర రేఖకు దిగువన ఉన్న పిల్లలకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాల‌న్నారు. అలాగు ఇంటర్మీడియట్ ను కూడా కేజీబీవీల్లో ప్రవేశ పెట్టడంతో బాలికల నమోదుశాతంతో పాటు ఆదరణ పెరుగుతోందని మంత్రి అన్నారు.  తొలుత రాష్ట్రంలో 53 కేజీబీవీలు.., 6,380 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాలయాల సంఖ్య ప్రస్తుతం 352కు చేరడంతో పాటు విద్యార్థుల సంఖ్య దాదాపు లక్షకు (98,560) చేరడం సంతోషంగా ఉందన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించాలని అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ విధానంలో బోధనను ఇస్తున్నారు. బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు పాఠశాలల్లో ఏర్పాటు చేశామన్నారు.

☛ AP CM YS Jagan Mohan Reddy : విద్యావ్యవస్థలో 'ఏఐ' భాగం కావాలి.. ఎందుకంటే..

ముఖ్యమంత్రి పాత్ర..
దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి, వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేయడంలో ముఖ్యమంత్రి పాత్ర అద్వితీయమన్నారు. నాణ్యమైన విద్యతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.

ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ శ్రీ.ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. పేద విద్యార్థులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఆంగ్లభాషలో పట్టు సాధించడం, డిజిటల్ టెక్నాలజీ నేర్చుకోవడం, టోఫెల్ ట్రైనింగ్, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, చాట్ జీపీటి, ఈ-కాన్ఫరెన్స్ యాప్,  బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు తద్వారా నైపుణ్యాలు పెంచుకునే అంశాలను వివరించారు.  

ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి.., బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా విధులు నిర్వర్తించడం వంటి అంశాలు ప్రతి  ఉపాధ్యాయుడి వృత్తిలో భాగమని ఉద్భోధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ గా తయారు చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేయాలన్నారు. ఉద్యోగం సాధించడానికి ఎలా సమయాన్ని వెచ్చించి విజయాన్ని సాధించారో అదే స్పూర్తి నిరంతరం కొనసాగాలని ఉద్ఘాటించారు.

గతంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యను పూర్తి చేసుకొని ఉన్నత స్థితికి ఎదిగిన పలువురు పూర్వవిద్యార్థినులను అభినందిస్తూ.. వీరికి జ్ఞాపికలను మంత్రి అందజేశారు.

➤ Andhra Pradesh Jobs 2023 : కొత్తగా ఐదు వైద్య కళాశాలలు.. 1,412 పోస్టులు.. అలాగే వివిధ పోస్టుల భర్తీకి..

#Tags